![]()
తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. మీడియాలో వరుస ఇంటర్వ్యూలతో తండేల్ టీం సందడి చేస్తోంది. ఇక ఇప్పటికే నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇకపై ఏ సినిమాకీ అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ఇవ్వదన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ తండేల్ సినిమాకు ఎలాంటి హైక్స్ రాలేదు. ఇక ఏపీలో టికెట్ రేట్ల పెంపు కోసం టీం ప్రయత్నం చేసింది.
బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ఈ మేరకు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్టుగా ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లభించింది. సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్సుల్లో రూ. 75 పెంచుకునే వీలు కల్పించింది. ఈ రేట్లు కూడా ఓ వారం రోజుల పాటే ఉండాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు రేట్లు పెంచిన ప్రభుత్వానికి గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ టికెట్ రేట్ల పెంపు మీద సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

0 Comments