
హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 2లో ఆమె చేసిన కిస్సిక్ సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. థియేటర్లలో ఈ పాట మోత మోగిపోయింది. ఇక ప్రస్తుతం మళ్లీ హీరోయిన్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయింది శ్రీలీల. నితిన్‌తో రాబిన్‌హుడ్, రవితేజతో మాస్ జాతర, శివకార్తికేయన్‌తో పరాశక్తి చిత్రాల్లో నటిస్తుంది శ్రీలీల.ఇక తాజాగా తన తల్లి స్వర్ణలత పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చింది శ్రీలీల. తన తల్లితో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన తల్లి కేక్ కట్ చేసే ముందు ఆమెని పైకి ఎత్తుకొని తెగ ఆనందపడిపోయింది శ్రీలీల. కానీ తన కూతురు అలా ఎత్తుకునే సరికి స్వర్ణలత కాస్త షాకయ్యారు. ఇక ఆమెని కిందకి దించేసి చూశావా నా బలం అంటూ శ్రీలీల అనడం చాలా క్యూట్‌గా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీలీలకి చాలా బలం ఉందయ్యో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

0 Comments