నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'సరిపోదా శనివారం'. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఎస్.జె సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో విడుదలకు సిద్ధమైంది.'సరిపోదా శనివారం' సినిమాని వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న జపాన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'సాటర్ డే మ్యాన్' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇండియాలో తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో 'సూర్యాస్ సాటర్ డే' టైటిల్ తో విడుదల చేశారు. ఇప్పుడు సరికొత్త టైటిల్ తో నాని సినిమాని జపనీస్ భాషలోకి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జపాన్ లో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

0 Comments